జడ్జిగా ఉత్తీర్ణత సాధించిన చైతన్య


*కష్టే ఫలి* అన్నారు పెద్దలు. కష్ట పడితే తప్పక విజయ తీరాలకు చేరవచ్చని అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మాండల కేంద్రానికి చెందిన చైతన్య నిరూపించారు. మారుమూల ప్రాంతంలో నివసిస్తూ  జూనియర్ సివిల్ జడ్జ్ నియామక ఫలితాల్లో ఉత్తిర్నురాలైనందుకు కన్న వారు మరియు ఊరు వారందరు సంబరాలు చేసుకున్నారు. కడు బీద కుటుంబం నుండి వచ్చిన ఆమె ప్రభుత్వ పాఠశాలలోనే చదివి లాసెట్ లో 330 ర్యాంక్ సాధించింది. కష్టపడితే ఫలితం వుంటుందనడానికి ఇమేనే ఉదాహరణకు తీసుకోవచ్చును. కావున ఆర్య వైశ్య యువత ఈమెను ఆదర్శంగా తీసుకుని వారి వారి భవిష్యత్తులను తీర్చి దిద్దుకోవాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదకులు ఉద్భోదిస్తూ చైతన్యను అభినందిస్తున్నవి.


కామెంట్‌లు