వాటర్ మేనేజ్మెంట్ ఫోరం, విశ్రాంత ఇంజినీర్ల సంఘం సహచర్యంతో విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్, హైదరాబాద్ లో తేదీ 17.10.2019 రోజున నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి నిరంజన్ రెడ్డి విచ్చేయగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమములో విశ్రాంత ఇంజినీర్లు, డెన్మార్క్ దేశం నుండి వచ్చిన జల సంరక్షణ రీసెర్చ్ నిపుణురాలు మరియు జల సంరక్షణ అను ఈ మహాయజ్ఞంలో పలు పంచుకొనుటకు తన బ్యాంక్ ఉద్యోగమును సైతం తృణప్రాయంగా వదలి వేసిన ఆదరనీయునితో సహా జల సంరక్షణ ఔత్సాహికులు తదితరులు పెఫండ సంఖ్యలో పాలగిన్నారు. అహ్మద్ నగర్ జిల్లాలోని హివరే బజార్ గ్రామ సర్పంచ్, ఈ రోజు ముఖ్య సందేశకులు, ఆదర్శవాది *శ్రీ పొపట్ రావు పవార్* మాట్లాడుచూ తన గ్రామంలో మద్యపాననిషేదం నూరు శాతం అమలు చేయిస్తున్నా మని, 1992 లోనే నూరు శాతం టాయలెట్లు ఏర్పాటు చేశామని, బోర్వెల్స్ లను నిషేధించి ప్రతి రైతు పొలం లో ఓపెన్ బావులను త్రవ్వించి వాననీటి సంరక్షణ పద్దతుల ద్వారా వాటిలో ఎండాకాలం లో కూడా నీరు వుండేవిధంగా చేసినామని, 2016 ఎప్రిల్ మన్కీబాత్ లో ప్రధాన మంత్రి 3నిముషాలు తన గ్రామ విశిష్టత గురించి మాట్లాడారని, 1989లో 90శాతం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న గ్రామాన్ని జీరో శాతానికి తీసుకొచ్చినామని, సాలీనా వర్షపాతం 400 మిల్లిమీటర్లు మాత్రమే ఉన్నప్పటికీ అహ్మద్ నగర్ జిల్లా లోని తన హివరే బజార్ గ్రామాన్ని నందనవనంగా తీర్చిదిద్దినా మని మహనీయుడు *శ్రీ పొపట్ రావు పవార్* గారు తన అనుభవాలను తెలియ జేశారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అవోపా తరపున సాంకేతిక సలహాదారు మునిగేటి సత్యనారాయణ గారు, ముఖ్య సలహాదారు పోకల చందర్ గారు, చీఫ్ కోఆర్డినేటర్ గుండా చంద్రమౌళి గారు మరియు ఇతర విశ్రాంత ఇంజినీర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జల సంరక్షణ సదస్సు
addComments
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి