పుస్తకావిష్కరణ

 తేదీ 5.9.2019 రోజున సౌమిత్రి పబ్లికేషన్స్ మరియు శ్రీ త్యాగరాయ గాణ సభ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అవోపా చీఫ్ ఎడిటర్ శ్రీ కూర చిదంబరం గారు రచించిన నీటి నీడ (కథా సంకలనం)మరియు అనుభవాలు -పాఠాలు ( వ్యాస సంకలనం) పుస్తకావిష్కరణ కార్యక్రమము జరిగినది. నిజం దినపత్రిక సంపాదకులు  శ్రీ బైస దేవదాసు గారు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాతెలంగాణ రాష్ట్ర సలహాదారు డా. కె.వి.రమణాచారి మరియు విశిష్ట అతిథులుగా శ్రీ కళా జనార్ధన మూర్తి, శ్రీ విహారి మరియు శ్రీ పొత్తూరి సుబ్బారావు, ఆత్మీయ అతిథిగా తంగిరాల చక్రవర్తి గారలు విచ్ఛేసి శ్రీ కూర చిదంబరం గారు పుస్తకములను ఆవిష్కరించారు. సౌమిత్రి పబ్లికేషన్స్ అధినేత్రి శ్రీమతి సుమిత్ర గారు జ్యోతి ప్రజ్వలన గావించారు. ఇదే వేదికపై శ్రీ కూర చిదంబరం గారు తన 75వ జన్మదినవేడుకలను జరుపుకున్నారు.  ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర అవోపా ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం, అవోపా ఎడిటర్ నూకా యాదగిరి, చీఫ్ కోఆర్డినేటర్ చంద్రమౌళి,  అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు నమశివాయ, పూర్వాధ్యక్షుడు చక్రపాణి, ఉపాధ్యక్షుడు బైసాని సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి బచ్చుఁ శ్రీనివాస్, ఐఫా పూర్వాధ్యక్షుడు వేముల రామకృష్ణ, సుబ్బారావు, రాజశేఖర్, నంబర్మళ్ళు, రాధాకృష్ణ,  సూర్యాగ్రాఫిక్స్ యజమాని జయకుమార్, కేశవ్ తదితరులు హాజరై శ్రీ కూర చిదంబరం గారిని అభినందించారు.
కామెంట్‌లు