గురుపూజోత్సవంతేదీ 14.9.2019 రోజున లక్ష్మీ కన్వెన్షన్ కర్మన్గాట్ హైదరాబాద్ లో డా.సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉత్తమ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు మరియు విశ్రాంత ఉపాధ్యాయులకు వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో గురుపూజోత్సవం చాలా అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ శాసన సభ్యుడు శ్రీ బిగాల గణేశ్ గుప్తా గారు విచ్చేయగా విశిష్ట అతిథులుగా సర్వాశ్రీ సముద్రాల వేణుగోపాలాచారి, డి.సుధీర్ రెడ్డి, వి.ప్రకాశ్, దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తా, ఎం.వి.రమేశ్, బి.సి.హెచ్ సుబ్బారావు మరియు గౌరవ అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అవోపా తరఫున ప్రధాన కార్యదర్శి నిజాం వెంక టేశం, ముఖ్య సలహాదారు శ్రీపోకల చందర్, కోఆర్డినేటర్ శ్రీ గుండా చంద్రమౌళి, భరత్ కుమార్, అమరవాది లక్ష్మీనారాయణ, వేముల శ్రీనివాస్, దైవజ్ఞశర్మ, దన్నారం శ్రీనివాస్ గుప్త, బెజగం మానస, బింగి నరేందర్ గౌడ్,  బ్యాంక్మెన్ చాపుటర్ అధ్యక్షుడు పి.వి.రమణయ్య తదితరులు పాల్గొని సుమారు 300 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వికాస వేదిక వ్యవస్తాపక చైర్మన్ కాసం సత్యనారాయణ గుప్త, ప్రధాన కార్యదర్శి చొక్కారపు రాజు గుప్త, కోశాధికారి కండే రాంనరేశ్, అదనపు ప్రధాన కార్యదర్శి నంగునూరి రమేశ్, విద్యా కమిటీ చైర్మన్ బాదం శ్రీనివాస్ తదితరులు నిర్వహించారు. ఇంతటి మహోన్నత కార్యక్రమము నిర్వహించిన కాసం సత్యనారాయణ గుప్తా గారిని వారి కమిటీని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గం అభినందిస్తున్నవి. 


కామెంట్‌లు