చీరెల పంపిణీతెలంగాణ రాష్ట్ర అవోపా యోగ కమిటీ వైస్-చైర్మన్ మరియు వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని క్రైంబ్రాంచ్ లో ఏ.ఎస్.ఐ గా పనిచేయుచున్న సంధ్యారాణి ఉరఫ్ సంతోష బతుకమ్మ మరియు దసరా పండుగలను పురస్కరించుకుని తన కార్యలయములో పనిచేయుచున్న హోమ్ గార్డులకు ఏ.సి.పి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా చీరెలు పంపిణీ చేసినారు. ఈ సందర్భముగా ఏ.సి.పి గారు మాట్లాడుచూ పోలీసు డిపార్టుమెంట్ లో పనిచేయు చున్న సంతోష గారు ఇలా చీరెలు ఇవ్వడం హర్షనీయమన్నారు. ఈ కార్య క్రమములో ఏ.ఆర్.ఎస్.ఐ శ్యామ్, సిబ్బంది మహిళా హోమ్ గార్డులు తదితరులు పాల్గొన్నారు.      


కామెంట్‌లు