అవార్డుల ప్రధానానికి దరఖాస్తులు


కరీంనగర్ పట్టణము మరియు మండలములోని ప్రతిభా వంతులైన ఆర్యవైశ్య విద్యార్థినీ విద్యార్థులకు 2018-19 నకు గాను మెరిట్ అవార్డులను ప్రధానం చేయాలని కరీంనగర్ పట్టణ ఆవోపా నిర్ణయించినది. ఈ అవార్డుల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా ఆవోపా అధ్యక్షులు కట్కూరి సుధాకర్ తెలియజేశారు. ఇందులో భాగంగా కరీంనగర్ పట్టణము మరియు మండలములోని వైశ్య విద్యార్థినీ విద్యార్థులు 10వ తరగతి, ఇంటర్మీడియెట్, ఎం.పి.సి. బైపిసి. హ్యుమానిటీస్, ఎంసెట్, ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీ, పిజి, పాలిటెక్నిక్ మరియు చార్టెర్డ్ అకౌంటెంట్ విభాగాలలో ఈ అవార్డులను ప్రధానం చేస్తున్నట్లు వారు తెలిపారు. 10వ తరగతిలో 9 జిపిఎ ఇంటర్లో 85% మార్కులకు పైగా ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 10000 ర్యాంక్ వరకు, ఎంసెట్ మెడికల్ విభాగంలో 2000 ర్యాంక్ వరకు, డిగ్రీ, పి.జి.లలో 75% మార్కులు, సి.ఎ. పాసైన విద్యార్థిని విద్యార్థులకు ఈ అవార్డులు అందజేయబడతాయి. ఈ అర్హతలు గల విద్యార్థిని విద్యార్థులు తమ మార్కుల/ ర్యాంకుల జాబితా జిరాక్స్ పై వైశ్య ప్రముఖలు చేత దృవీకరింపజేసి పూర్తి పోస్టల్ అడ్రస్, రెండు పాస్ పోర్టు సైజ్ ఫోటోలతో సెల్ నెంబర్, ఆధార్ కార్డు జిరాక్స్ తో తేది 31-8-2019 లోపు పాత రాధాకిషన్, విజయలక్ష్మి ఇన్స్ట్రమెంట్స్ ఇంటి నెం. 7-1-856, మంకమ్మతోట, పెట్రోల్ పంపుదగ్గర, కరీంనగర్. ఫోన్ నెం. 9440020419, జిల్లా అంజయ్య ఇంటి నెం. 7-2-398ఎ, మంకమ్మతోట, కరీంనగర్, సెల్ నెం. 9492369935 అను చిరునామాలకు పోస్టల్ ద్వారా గాని స్వయంగా గాని పంపించగలరు.
ఇట్లు - కట్కూరు సుధాకర్, కరీంనగర్ టౌన్ జిల్లా అధ్యక్షులు


కామెంట్‌లు