జన్మదిన శుభాకాంక్షలు

 
మంచిర్యాల జిల్లా అవోపా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ తన 62వ జన్మ  దినమును  ఘనంగా లక్సట్టిపేట్ లోని మానసిక వికాస కేంద్రంలోని దివ్యాన్గ విద్యార్థినీ విద్యార్థుల మధ్య జరుపుకుని వారికి పండ్లు మిఠాయిలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో అవోపా జిల్లా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ, రాష్ట్ర ఆవోపా ఉపాధ్యక్షుడు గుండ ప్రభాకర్, పట్టణ ఆవోపా అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్, ఆవోపా నాయకులు కట్కూరి కిషన్, రాచర్ల సత్యనారాయణ, బొదుకూరి సత్తయ్య, రాజమౌళి, గౌరిశెట్టి కిషన్, గౌరిశెట్టి సంతోష్, నాగిశెట్టి రమేష్, తెరాస మండల ప్రెసిడెంట్ పోడేటి శ్రీనివాస్ గౌడు, మొహమ్మద్ ఆరీఫ్, గరిసె రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కావున పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న మంచిర్యాల అవోపా జిల్లాధ్యక్షుడు శ్రీ గుండా సత్యనారాయణ గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్ష కార్యవర్గము మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము జన్మదిన శుభాకాంక్షలు తెలుపు చున్నవి.


కామెంట్‌లు