గురు పూజామహోత్సవము

   


తేదీ 14. 7.2019 రోజున అవోపా బ్యాంక్ మాన్  చాప్టర్ మరియు ఆవోప హబ్సిగూడ వారు సంయుక్తంగా కాచిగూడ లోని వైశ్య హాస్టల్ లో నిర్వహించిన గురు పూజా మహోత్సవంలో సిండికేట్ బ్యాంక్  రిటైర్డ్ చీఫ్ మేనేజర్, వక్త, కవి డా.రాధాశ్రీ గారిని సన్మానించారు. ఇదే కార్యక్రమంలో సివిల్స్లో 375వ ర్యాంకు సాధించిన శ్రీమతి అనుషా గారిని, అఖిల భారత నీట్ పోటీ పరిక్షలో 832 ర్యాంకు మరియు బంగారు పతకం సాధించి ఉస్మానియా వైద్య కళాశాలలో సీటు పొందిన ప్రతిమను సన్మానించారు. ఇంటర్ రెండవ సంవత్సరం చదువుచున్న బీద విద్యార్థిని  గీతాసాయికి రు.30000ల అర్గిక సహాయమందించారు. వేలూరు రవీంద్రనాథ్ గుప్త గారితో సహా 5గురు కాచిగూడ వైశ్య హాస్టల్ కమిటీ సభ్యులను కూడా సన్మానించారు. ఈ సమావేశంలో కె. రామానందం గారు గురుపూర్ణిమ యొక్క విశేషాలను వివరించగా సెంట్రల్ బ్యాన్క్ ఆఫ్ ఇండియా ఫాకల్టీ సురేంద్రనాథ్ గారు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ జిల్లా జడ్జి శ్రీ ఎన్. మాల్యాద్రి గారు గెస్ట్ ఆఫ్ హానర్గా  శ్రీ పుండరీకాక్షయ్య గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ విశ్వనాధం గారు బ్యాంక్ మాన్ చాపుటర్ అధ్యక్షుడు రమణయ్య గారు అవోపా హబ్సిగూడ అధ్యక్షుడు నెరేళ్ల ప్రసాద్, కెవిఎస్ గుప్తా, మద్ది హన్మంతరావు, సురేంద్రనాథ్, మోహన్ దాస్ గారలు హాజరై కార్యక్రమాన్ని విజయవంత మొనర్చినారు. గురుపూజా కార్యక్రమాన్ని శ్రద్దా సక్తులతో నిర్వహించినందున వారికి తెలంగాణ అవోపా మరియు  అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెల్పుచున్నవి.
కామెంట్‌లు